Skip to main content

Posts

Showing posts from 2018

నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు

భారతదేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైన పంట.   ప్రస్తుతం అనేక ప్రాంతాలలో రబీ వేరుశనగ కోతలు ప్రారంభమయినాయి.   కొన్ని ప్రాంతాలలో వేరుశనగ కోతలు పూర్తి అయిపోయినాయి.   ఈ కోతలు పూర్తి అయిన తర్వాత సరైన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ విత్తనాన్ని రాబోవు ఖరిఫ్ కాలం సరిగా వాడుకోవోచ్చును లేదంటే విత్తనం పుచ్చు పట్టి పనికిరాకుండా పోతుంది.   ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే రైతులు వేరుశనగ కోత మొదలుకొని విత్తనంను నిల్వ ఉంచే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుగుకుందాం. వేరుశనగను ఎప్పుడు కోయాలి? వేరుశనగను సరిగ్గా 70 నుంచి 80 శాతం వరకు మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారి కాయ డొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేవిధంగా చూసుకోవాలి. వేరుశనగ కోత తర్వాత పాటించవలిసిన జాగ్రత్తలు ఏమిటి? వేరుశనగను కోసిన తర్వాత తగిన తేమ అనగా 9 శాతం వరకు ఉండే విధంగా చూసుకోవాలి, మొక్క నుండి కాయలు వేరు చేయుటకు ముందు ఎండబెట్టాలి.   ఇది రెండు విధాలుగా చేయవచ్చు. కాయల పైభాగానికి వచ్చునట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి లేదా మొక