Skip to main content

నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు



నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు

భారతదేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైన పంట.  ప్రస్తుతం అనేక ప్రాంతాలలో రబీ వేరుశనగ కోతలు ప్రారంభమయినాయి.  కొన్ని ప్రాంతాలలో వేరుశనగ కోతలు పూర్తి అయిపోయినాయి.  ఈ కోతలు పూర్తి అయిన తర్వాత సరైన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ విత్తనాన్ని రాబోవు ఖరిఫ్ కాలం సరిగా వాడుకోవోచ్చును లేదంటే విత్తనం పుచ్చు పట్టి పనికిరాకుండా పోతుంది.  ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే రైతులు వేరుశనగ కోత మొదలుకొని విత్తనంను నిల్వ ఉంచే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుగుకుందాం.

నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు

వేరుశనగను ఎప్పుడు కోయాలి?
వేరుశనగను సరిగ్గా 70 నుంచి 80 శాతం వరకు మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారి కాయ డొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి.
కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేవిధంగా చూసుకోవాలి.
నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు

వేరుశనగ కోత తర్వాత పాటించవలిసిన జాగ్రత్తలు ఏమిటి?
వేరుశనగను కోసిన తర్వాత తగిన తేమ అనగా 9 శాతం వరకు ఉండే విధంగా చూసుకోవాలి, మొక్క నుండి కాయలు వేరు చేయుటకు ముందు ఎండబెట్టాలి.  ఇది రెండు విధాలుగా చేయవచ్చు.
కాయల పైభాగానికి వచ్చునట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలు ప్రక్కలకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టవచ్చును.
కాయలలో ఎక్కువ తేమ శాతం ఉండే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7 నుండి 8 శాతానికి తీసుకురావాలి.  అందుకుగాను వేడి గాలిని వదిలే పరికరాన్ని ఉపయోగించాలి ఈపరికరాన్ని ఉపయోగించడం వలన కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేకుండానే తేమను తగు మోతాదుకు తీసుకురావొచ్చును.
ఒక్కసారి ఉపయోగించిన సంచులను మరల ఉపయోగించడం మంచిది కాదు.
లోపల పాలితిన్ పేపరులో ఉన్న గొనె సంచులు బాగా ఎండిన వేరుశనగ కాయలు నిలువ ఉంచుటకు ఉపయోగించుట మంచిది.  కాయలను కదిలిస్తే గల్లుమనే శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం.
కాయలు పూర్తిగా ఎండకముందే వర్షం వస్తే, వర్షం ఆగిన తర్వాత కాయలు మరల ఎండబెట్టాలి.   లేదంటే శిలీంద్రం త్వరగా ఆశిస్తుంది.
రబీ కాలంలో కాయలను పీకేటప్పుడు వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటి గ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు, నీడలో ఆరబెట్టాలి.  లేదా ఎండ తీవ్రత ఉదయం 10 గంటల ప్రాంతాన మరియు సాయంత్రం 4 గంటల తర్వాత సమయంలో ఉష్ణోగ్రత తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో ఆరబెట్టవచ్చును.
ఆరబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి.
విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ ఉంచుకోవాలి.

వేరుశనగ కాయలను నిల్వ ఉంచేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి?
కాయలను నిల్వ చేయడానికి శుబ్రమైనలోపల పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి.
గోనె సంచులను 0.5 శాతం మాలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టాలి.
గోనె సంచులలో కాయలతో పాటు వేప ఆకులు గానీ, వేప గింజల పొడిని గానీ కలిపి నిల్వ ఉంచినప్పుడు పురుగుల ఉధృతి తక్కువగా ఉంటుంది.
కాయలను నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి.
బస్తాలను నేరుగా నేలపై పెట్టకుండా ఒక్క అడుగు ఎత్తు చెక్క బల్లాలను పరిచి వాటి మీద మూటలను ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున ఒక వరుసలో అమర్చాలి.  వరుసకు, వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి.
కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వ చేసే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి.  గాలిలో తేమ 65 నుండి 70 శాతం మధ్య ఉండాలి, దీని కంటే ఎక్కువగా ఉంటే శిలీంద్రాలు అభివృద్ధి చెందుతాయి.
కాయలను నెలకి ఒక్కసారి పరిశీలించి, పురుగు ఉద్రుతిని బట్టి క్రిమి సంహారక మందులతో ముఖ్యంగా మాలాథియాన్ ను 5 మి.లీ. లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి సంచులపైన, నిల్వ ఉంచే గదులలో గోడల పైన పిచికారి చేయాలి.
వేరు శనగ కాయలను గోదాముల్లో ఉంచినప్పుడు పెంకు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది.  కిలో కాయలకు 5 మి.లీ. వేప నూనె చొప్పున కలిపి ఉంచినచో దాదాపు 4-5 నెలల వరకు ఎటువంటి పురుగులు ఆశిన్చావు.




గమనిక:  పై సూచనలు నిపుణుల నుంచి సేకరించి ప్రచురించడమైనది మరియు ఎటువంటి దుష్ప్రభావం కానీ ఎటువంటి చెడు ఫలితంనాకు కానీ ఈ వెబ్సైటు వారు బాధ్యులు కారు.

Comments

Popular posts from this blog

వరిలో బాటలు తీయడం వల్ల ప్రయోజనాలు (Benefits by formation of Alley ways in Paddy)

    వరి నట్లు వేశాక రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  వరిలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులలో ఒక ముఖ్యమైన పని వరిలో బాటలు తీయడం.  వరిలో ఈ బాటలు ఏ సమయంలో ఏ విధంగా తీయాలి?  వాటివల్ల కలిగే ప్రయోజనలేమిటి? అనే సందేహాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇస్తున్న సమాధానాలను రైతు సోదరుల కొరకు అందిస్తున్నాం.     వరి నాటు నాటిన 10-15 రోజులలోపు బాటలు తీయడం మంచిది.  ఇంతకన్నా ముడుగానే బాటలు తీస్తే మొక్కలు లేచిపోవటం జరుగుతుంది.  10-15 రోజుల తర్వాతే మొక్కలు గట్టిగ ఉండి తెగిపోయే అవకాశం ఉంది.  మడిలో నీటి మట్టం 3-5 సెంటి మీటర్లు ఉన్నప్పుడే బాటలు తీయాలి.  బాటలు తీసేందుకు మడి పొడవును బట్టి తాడు పొడవును నిర్ణయించాలి.  తాడు పెన్సిల్ మందం ఉండే విధంగా చూసుకోవాలి.  తాడు ఎక్కువ లవయిన బిరుసుదనం రాదు.  సంనమైతే తెగే అవకాశముంది.  తాడును మడికి ఆ గట్టున ఒకరు ఈ గట్టున ఒకరు పట్టుకొని లాగి చివరలు పుల్లకు కట్టి ప్రతి రెండు మీటర్లకు 20 సెంటి మీటర్లు కాలి బాటను తీయాలి.  దీనివల్ల బాటల మధ్యలో కోత సమయంలో 3 నుండి 4 ఓదుల సమన పనలుగా పది త్వరగా ఎండిపోయే అవకాశముంది.  ముఖ్యంగా బాటలను మడికి గాలివాటంగా తీయాలి.  దీనివల్ల మడి

మలబారు వేప (Malabaru Vepa/ Neem) సాగు, పెట్టుబడి, లాభ నష్టాల వివరాలు

మలబారు వేప చెట్టును తెలుగు వ్యవహారిక భాషలో "కొండ వేప" అని కూడా అంటారు.  రైతులు ఈ చెట్లను మల్బరీ వ్యాప్ (Mulbari Vyap/ Malbary Wap) అని అంటున్నారు.  ఈ మద్య కాలంలో అభ్యుదయ రైతులు , యువ రైతులు మలబారు వేప సాగు పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు.   మలబారు వేప ఎలాంటి ఆదునిక సాంకేతిక పద్ధతులు (టిష్యూ కల్చర్పా , క్లాతింగ్) పాటించకుండానే అతి తక్కువ సమయంలో బాగా పెరుగుతుంది. మలబారు వేప (కొండ వేప) సాగు విధానం మరియు దిగుబడి వివరాలు: మలబారు వేప (కొండ వేప) విత్తనాలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి , విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.  మలబారు వేప (కొండ వేప) పెంచుటకు మొక్కల మద్య దూరం 4' X 4' గా విత్తుకోవాలి, ఈ నిష్పత్తిలో సాగు చేసినచో 2800  మలబారు వేప   మొక్కలను   ఒక ఎకరం భూమి లో పెంచవచ్చును.   2 సంవత్సరముల తర్వాత దిగుబడి 50 టన్నులు గా నమోదు కావొచ్చును. మొక్కల మద్య దూరం 8’ X 8’ విత్తుకున్నట్లయితే ఎకరానికి 700ల మొక్కలు సాగు చేసుకోవొచ్చు.  7 సంవత్సరముల తర్వాత దిగుబడి 700 టన్నులు గా నమోదు కావొచ్చును. మలబారు వేప (కొండ వేప) మార్కెట్ రేట్: ప్రస్తుత మార్కెట్ వ

Value Addition to Rice: వరితో విలువాధారిత పదార్థాల తయారి

     వరి ధాన్యం నుండి బియ్యం, నూక, తవుడు, ఊక ఉప పదార్థాలు వస్తాయి.  వరి ధాన్యం నుండి బియ్యం, తక్కువ పోటాష్ వేసిన బియ్యం, ఉప్పుడు బియ్యం, ఉప్పుడు రవ్వ (ఇడ్లి రవ్వ)ను తాయారు చేయవచ్చును.  తవుడు నుండి రైస్ బ్రాన్ ఆయిల్ ను తీస్తారు.      వరి ధాన్యం నుండి మరమరాలు (బొంగు పేలాలు), అటుకులు తాయారు చేయవచ్చును. వరి మరియు ఇతర ఉప పదార్థాలలో ఉన్న పోషక విలువలు (100 గ్రా.లలో): 1. బియ్యం (గ్రా.): మాంస క్రుత్తులు: 6.9, క్రొవ్వు: 0.4, కాల్షియం: 0.01, ఇనుము: 1.0 మీ.గ్రా., శక్తి: 3.47 కి.కే., 2. ఉప్పుడు బియ్యం (గ్రా.): మాంస క్రుత్తులు: 6.4, క్రొవ్వు: 0.4, కాల్షియం: 0.01, ఇనుము: 2.2 మీ.గ్రా., శక్తి: 3.45 కి.కే. 3. అటుకులు (గ్రా.): మాంస క్రుత్తులు: 6.6, క్రొవ్వు: 0.2, కాల్షియం: 0.02, ఇనుము: 8.0 మీ.గ్రా., శక్తి: 3.47 కి.కే. 4. మరమరాలు (గ్రా.): మాంస క్రుత్తులు: 7.5, క్రొవ్వు: 0.1, కాల్షియం: 0.02, ఇనుము: 6.2 మీ.గ్రా., శక్తి: 3.27 కి.కే.     మహిళలు, యువ రైతులు వారితో రకరకాల ఆహార పదార్థాల తయారిని చిన్న కుటీర పరిశ్రమ గా చేసుకొని స్వయం ఉపాధి పొందవచ్చును.      దంపుడు బియ్యం, పోటాష్ తక్కువ చేసిన బియ్యం, ఉప్ప