Skip to main content

మలబారు వేప (Malabaru Vepa/ Neem) సాగు, పెట్టుబడి, లాభ నష్టాల వివరాలు

మలబారు వేప చెట్టును తెలుగు వ్యవహారిక భాషలో "కొండ వేప" అని కూడా అంటారు.  రైతులు ఈ చెట్లను మల్బరీ వ్యాప్ (Mulbari Vyap/ Malbary Wap) అని అంటున్నారు.  ఈ మద్య కాలంలో అభ్యుదయ రైతులు, యువ రైతులు మలబారు వేప సాగు పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు.  



మలబారు వేప ఎలాంటి ఆదునిక సాంకేతిక పద్ధతులు (టిష్యూ కల్చర్పా, క్లాతింగ్) పాటించకుండానే అతి తక్కువ సమయంలో బాగా పెరుగుతుంది.

మలబారు వేప (కొండ వేప) సాగు విధానం మరియు దిగుబడి వివరాలు:

మలబారు వేప (కొండ వేప) విత్తనాలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి, విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.  మలబారు వేప (కొండ వేప) పెంచుటకు మొక్కల మద్య దూరం 4' X 4' గా విత్తుకోవాలి, ఈ నిష్పత్తిలో సాగు చేసినచో 2800 మలబారు వేప మొక్కలను  ఒక ఎకరం భూమి లో పెంచవచ్చును.   2 సంవత్సరముల తర్వాత దిగుబడి 50 టన్నులు గా నమోదు కావొచ్చును.

మొక్కల మద్య దూరం 8’ X 8’ విత్తుకున్నట్లయితే ఎకరానికి 700ల మొక్కలు సాగు చేసుకోవొచ్చు.  7 సంవత్సరముల తర్వాత దిగుబడి 700 టన్నులు గా నమోదు కావొచ్చును.

మలబారు వేప (కొండ వేప) మార్కెట్ రేట్:

ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపుగా రూ. 2500/- నుండి రూ. 4000/- ఒక టన్నుకు చొప్పున మార్కెట్ రేట్ లబించునని అంచనా.  మార్కెట్ రేట్ ఎప్పడికప్పుడు ఉత్పత్తిని బట్టి మారుతూ ఉంటుంది.

మలబారు వేప (కొండ వేప) సాగులో అనుకూలతలు:

మలబారు వేప (కొండ వేప)ను తక్కువ నీటితో సాగు చేసుకోవొచ్చు.  ఎలాంటి నెలలో ఐన సాగు చేసుకోవొచ్చు.  అతి తక్కువ సమయం లో ఎక్కువ పెరుగుతుంది.  2 సంవత్సరాల నుండి రైతులు వీటిని మార్కెట్ చేసుకోవోచ్చును.  7 సంవత్సరాలు ఆగితే ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చును.  నిరుపయోగమైన భూములలో వీటి సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చును.

మలబారు వేప (కొండ వేప) సాగులో ఉత్పన్నమయ్యే సమస్యలు:

మలబారు వేప (కొండ వేప) ఈదురు గాలులను, తుఫాన్ లను తట్టుకోలేదు. ఇలాంటి ప్రక్రుతి వైపరీత్యాలు వొచ్చినప్పుడు చెట్లు విరిగిపోతాయి, రైతులు మార్కెట్ రేట్ లేకున్నా కూడా తమ సరుకును అమ్మవలసి వొస్తుంది.  అందుకే రైతులు ఈ మలబారు వేప (కొండ వేప) పెంపకానికి విత్తనాలను ఉపయోగించి సాగు చేయకుండా పెరిగిన మొక్కలను తెచ్చి నాటుకొని సాగు చేసుకొనుట ఉత్తమం.

మలబారు వేప (కొండ వేప)ను ఉపయోగించే పరిశ్రమలు:

ముఖ్యంగా మలబారు వేప (కొండ వేప) యొక్క కర్ర ను ప్లై వుడ్ తయారీ లో వాడుతారు.



ఈ వ్యాసం సాంకేతిక నిపుణులనుండి సమాచారం సేకరించి వ్రాయడమైనది.  వ్యాసం లో వ్యక్తపరిచిన ఏఒక్క విషయం కాని సంభందిత సాంకేతిక నిపుణుల సలహా లేకుండా అమలు చేయరాదు.  వ్యాసకర్త మరియు ఈ వెబ్సైటు వారు ఎలాంటి బాధ్యులు కారు.



See Also: malbari vyap, konda vepa, malabaru vepa, malabaru neem, azadiracta indica, malbari vap, malabaru vepa cultivation details, malbari vyap cultivation pempakam, pettubadi, labhalu.

Comments

Popular posts from this blog

వరిలో బాటలు తీయడం వల్ల ప్రయోజనాలు (Benefits by formation of Alley ways in Paddy)

    వరి నట్లు వేశాక రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  వరిలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులలో ఒక ముఖ్యమైన పని వరిలో బాటలు తీయడం.  వరిలో ఈ బాటలు ఏ సమయంలో ఏ విధంగా తీయాలి?  వాటివల్ల కలిగే ప్రయోజనలేమిటి? అనే సందేహాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇస్తున్న సమాధానాలను రైతు సోదరుల కొరకు అందిస్తున్నాం.     వరి నాటు నాటిన 10-15 రోజులలోపు బాటలు తీయడం మంచిది.  ఇంతకన్నా ముడుగానే బాటలు తీస్తే మొక్కలు లేచిపోవటం జరుగుతుంది.  10-15 రోజుల తర్వాతే మొక్కలు గట్టిగ ఉండి తెగిపోయే అవకాశం ఉంది.  మడిలో నీటి మట్టం 3-5 సెంటి మీటర్లు ఉన్నప్పుడే బాటలు తీయాలి.  బాటలు తీసేందుకు మడి పొడవును బట్టి తాడు పొడవును నిర్ణయించాలి.  తాడు పెన్సిల్ మందం ఉండే విధంగా చూసుకోవాలి.  తాడు ఎక్కువ లవయిన బిరుసుదనం రాదు.  సంనమైతే తెగే అవకాశముంది.  తాడును మడికి ఆ గట్టున ఒకరు ఈ గట్టున ఒకరు పట్టుకొని లాగి చివరలు పుల్లకు కట్టి ప్రతి రెండు మీటర్లకు 20 సెంటి మీటర్లు కాలి బాటను తీయాలి.  దీనివల్ల బాటల మధ్యలో కోత సమయంలో 3 నుండి 4 ఓదుల సమన పనలుగా పది త్వరగా ఎండిపోయే అవకాశముంది.  ముఖ్యంగా బాటలను మడికి గాలివాటంగా తీయాలి.  దీనివల్ల మడి

Value Addition to Rice: వరితో విలువాధారిత పదార్థాల తయారి

     వరి ధాన్యం నుండి బియ్యం, నూక, తవుడు, ఊక ఉప పదార్థాలు వస్తాయి.  వరి ధాన్యం నుండి బియ్యం, తక్కువ పోటాష్ వేసిన బియ్యం, ఉప్పుడు బియ్యం, ఉప్పుడు రవ్వ (ఇడ్లి రవ్వ)ను తాయారు చేయవచ్చును.  తవుడు నుండి రైస్ బ్రాన్ ఆయిల్ ను తీస్తారు.      వరి ధాన్యం నుండి మరమరాలు (బొంగు పేలాలు), అటుకులు తాయారు చేయవచ్చును. వరి మరియు ఇతర ఉప పదార్థాలలో ఉన్న పోషక విలువలు (100 గ్రా.లలో): 1. బియ్యం (గ్రా.): మాంస క్రుత్తులు: 6.9, క్రొవ్వు: 0.4, కాల్షియం: 0.01, ఇనుము: 1.0 మీ.గ్రా., శక్తి: 3.47 కి.కే., 2. ఉప్పుడు బియ్యం (గ్రా.): మాంస క్రుత్తులు: 6.4, క్రొవ్వు: 0.4, కాల్షియం: 0.01, ఇనుము: 2.2 మీ.గ్రా., శక్తి: 3.45 కి.కే. 3. అటుకులు (గ్రా.): మాంస క్రుత్తులు: 6.6, క్రొవ్వు: 0.2, కాల్షియం: 0.02, ఇనుము: 8.0 మీ.గ్రా., శక్తి: 3.47 కి.కే. 4. మరమరాలు (గ్రా.): మాంస క్రుత్తులు: 7.5, క్రొవ్వు: 0.1, కాల్షియం: 0.02, ఇనుము: 6.2 మీ.గ్రా., శక్తి: 3.27 కి.కే.     మహిళలు, యువ రైతులు వారితో రకరకాల ఆహార పదార్థాల తయారిని చిన్న కుటీర పరిశ్రమ గా చేసుకొని స్వయం ఉపాధి పొందవచ్చును.      దంపుడు బియ్యం, పోటాష్ తక్కువ చేసిన బియ్యం, ఉప్ప