Skip to main content

నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు



నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు

భారతదేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైన పంట.  ప్రస్తుతం అనేక ప్రాంతాలలో రబీ వేరుశనగ కోతలు ప్రారంభమయినాయి.  కొన్ని ప్రాంతాలలో వేరుశనగ కోతలు పూర్తి అయిపోయినాయి.  ఈ కోతలు పూర్తి అయిన తర్వాత సరైన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ విత్తనాన్ని రాబోవు ఖరిఫ్ కాలం సరిగా వాడుకోవోచ్చును లేదంటే విత్తనం పుచ్చు పట్టి పనికిరాకుండా పోతుంది.  ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే రైతులు వేరుశనగ కోత మొదలుకొని విత్తనంను నిల్వ ఉంచే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుగుకుందాం.

నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు

వేరుశనగను ఎప్పుడు కోయాలి?
వేరుశనగను సరిగ్గా 70 నుంచి 80 శాతం వరకు మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారి కాయ డొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి.
కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేవిధంగా చూసుకోవాలి.
నాణ్యమైన విత్తనం కోసం వేరుశనగలో కోత తర్వాత మరియు విత్తనం నిల్వ చేసేటపుడు పాటించవలసిన జాగ్రత్తలు

వేరుశనగ కోత తర్వాత పాటించవలిసిన జాగ్రత్తలు ఏమిటి?
వేరుశనగను కోసిన తర్వాత తగిన తేమ అనగా 9 శాతం వరకు ఉండే విధంగా చూసుకోవాలి, మొక్క నుండి కాయలు వేరు చేయుటకు ముందు ఎండబెట్టాలి.  ఇది రెండు విధాలుగా చేయవచ్చు.
కాయల పైభాగానికి వచ్చునట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలు ప్రక్కలకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టవచ్చును.
కాయలలో ఎక్కువ తేమ శాతం ఉండే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7 నుండి 8 శాతానికి తీసుకురావాలి.  అందుకుగాను వేడి గాలిని వదిలే పరికరాన్ని ఉపయోగించాలి ఈపరికరాన్ని ఉపయోగించడం వలన కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేకుండానే తేమను తగు మోతాదుకు తీసుకురావొచ్చును.
ఒక్కసారి ఉపయోగించిన సంచులను మరల ఉపయోగించడం మంచిది కాదు.
లోపల పాలితిన్ పేపరులో ఉన్న గొనె సంచులు బాగా ఎండిన వేరుశనగ కాయలు నిలువ ఉంచుటకు ఉపయోగించుట మంచిది.  కాయలను కదిలిస్తే గల్లుమనే శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం.
కాయలు పూర్తిగా ఎండకముందే వర్షం వస్తే, వర్షం ఆగిన తర్వాత కాయలు మరల ఎండబెట్టాలి.   లేదంటే శిలీంద్రం త్వరగా ఆశిస్తుంది.
రబీ కాలంలో కాయలను పీకేటప్పుడు వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటి గ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు, నీడలో ఆరబెట్టాలి.  లేదా ఎండ తీవ్రత ఉదయం 10 గంటల ప్రాంతాన మరియు సాయంత్రం 4 గంటల తర్వాత సమయంలో ఉష్ణోగ్రత తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో ఆరబెట్టవచ్చును.
ఆరబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి.
విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ ఉంచుకోవాలి.

వేరుశనగ కాయలను నిల్వ ఉంచేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి?
కాయలను నిల్వ చేయడానికి శుబ్రమైనలోపల పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి.
గోనె సంచులను 0.5 శాతం మాలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టాలి.
గోనె సంచులలో కాయలతో పాటు వేప ఆకులు గానీ, వేప గింజల పొడిని గానీ కలిపి నిల్వ ఉంచినప్పుడు పురుగుల ఉధృతి తక్కువగా ఉంటుంది.
కాయలను నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి.
బస్తాలను నేరుగా నేలపై పెట్టకుండా ఒక్క అడుగు ఎత్తు చెక్క బల్లాలను పరిచి వాటి మీద మూటలను ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున ఒక వరుసలో అమర్చాలి.  వరుసకు, వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి.
కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వ చేసే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి.  గాలిలో తేమ 65 నుండి 70 శాతం మధ్య ఉండాలి, దీని కంటే ఎక్కువగా ఉంటే శిలీంద్రాలు అభివృద్ధి చెందుతాయి.
కాయలను నెలకి ఒక్కసారి పరిశీలించి, పురుగు ఉద్రుతిని బట్టి క్రిమి సంహారక మందులతో ముఖ్యంగా మాలాథియాన్ ను 5 మి.లీ. లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి సంచులపైన, నిల్వ ఉంచే గదులలో గోడల పైన పిచికారి చేయాలి.
వేరు శనగ కాయలను గోదాముల్లో ఉంచినప్పుడు పెంకు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది.  కిలో కాయలకు 5 మి.లీ. వేప నూనె చొప్పున కలిపి ఉంచినచో దాదాపు 4-5 నెలల వరకు ఎటువంటి పురుగులు ఆశిన్చావు.




గమనిక:  పై సూచనలు నిపుణుల నుంచి సేకరించి ప్రచురించడమైనది మరియు ఎటువంటి దుష్ప్రభావం కానీ ఎటువంటి చెడు ఫలితంనాకు కానీ ఈ వెబ్సైటు వారు బాధ్యులు కారు.

Comments