మలబారు వేప చెట్టును తెలుగు వ్యవహారిక భాషలో "కొండ వేప" అని కూడా అంటారు. రైతులు ఈ చెట్లను మల్బరీ వ్యాప్ (Mulbari Vyap/ Malbary Wap) అని అంటున్నారు. ఈ మద్య కాలంలో అభ్యుదయ రైతులు , యువ రైతులు మలబారు వేప సాగు పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. మలబారు వేప ఎలాంటి ఆదునిక సాంకేతిక పద్ధతులు (టిష్యూ కల్చర్పా , క్లాతింగ్) పాటించకుండానే అతి తక్కువ సమయంలో బాగా పెరుగుతుంది. మలబారు వేప (కొండ వేప) సాగు విధానం మరియు దిగుబడి వివరాలు: మలబారు వేప (కొండ వేప) విత్తనాలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి , విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మలబారు వేప (కొండ వేప) పెంచుటకు మొక్కల మద్య దూరం 4' X 4' గా విత్తుకోవాలి, ఈ నిష్పత్తిలో సాగు చేసినచో 2800 మలబారు వేప మొక్కలను ఒక ఎకరం భూమి లో పెంచవచ్చును. 2 సంవత్సరముల తర్వాత దిగుబడి 50 టన్నులు గా నమోదు కావొచ్చును. మొక్కల మద్య దూరం 8’ X 8’ విత్తుకున్నట్లయితే ఎకరానికి 700ల మొక్కలు సాగు చేసుకోవొచ్చు. 7 సంవత్సరముల తర్వాత దిగుబడి 700 టన్నులు గా నమోదు కావొచ్చును. మలబారు వేప (కొండ వేప) ...
visit www.4kisan.blogspot.com to know the latest information and technology about agriculture, horticulture, veterinary/ animal husbandry, fisheries, foods & nutrition, home science, income generation activities, small-scale business ideas, household income ideas, etc